హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా లీగ్‌కు దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీని జట్టులోకి తీసుకుంది. రూ. 2 కోట్లకు కోయెట్జీని తీసుకున్నట్లు ఫ్రాంచైజీ శనివారం వెల్లడించింది.
గతంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన కోయెట్జీ 15 వికెట్లు తీశాడు. వేగంతో పాటు నిలకడగా లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ వేయడంలో కోయెట్జీ దిట్ట. సౌతాఫ్రికా తరఫున్ 4 టెస్ట్‌లు, 14 వన్డేలు, 18 టీ20లు ఆడాడు.

