V6 News

జూన్‌‌‌‌‌‌‌‌లో హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ టీజీ20 లీగ్‌‌‌‌‌‌‌‌... 8 ఫ్రాంచైజీల ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ రైట్స్‌‌‌‌‌‌‌‌ కోసం నోటిఫికేషన్ విడుదల

జూన్‌‌‌‌‌‌‌‌లో హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ టీజీ20 లీగ్‌‌‌‌‌‌‌‌... 8 ఫ్రాంచైజీల ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ రైట్స్‌‌‌‌‌‌‌‌ కోసం నోటిఫికేషన్ విడుదల
  • ఒక టీమ్ కనీస ధర రూ. 3 కోట్లు 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో క్రికెట్ టాలెంట్‌‌‌‌‌‌‌‌ను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ) టీజీ20 లీగ్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. జూన్‌‌‌‌‌‌‌‌లో  ప్రారంభం కానున్న ఈ లీగ్  ఫ్రాంచైజీ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ రైట్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్  (ఈఓఐ) నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను శనివారం విడుదల చేసింది. ఈ టోర్నీలో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటాయని, అన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో నిర్వహిస్తామని హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ తెలిపింది. 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రతినిధులుగా ఉండే ఈ జట్లను దక్కించుకోవడానికి ఆసక్తి గల సంస్థలు ఈనెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒక టీమ్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకోవడానికి కనీస బిడ్ ధరను రూ. 3 కోట్లుగా నిర్ణయించింది. 

ఫ్రాంచైజీ హక్కులు పొందే సంస్థకు కనీసం రూ. 100 కోట్ల వార్షిక టర్నోవర్ ఉండటంతో పాటు తెలంగాణలో రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండాలనే నిబంధనలు విధించారు. లోకల్ ప్లేయర్లకు ఐపీఎల్ తరహాలో ఒక అత్యుత్తమ వేదికను కల్పించడమే తమ లక్ష్యమని టీజీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ వి. అగం రావు తెలిపారు.