
క్రికెట్ అంటేనే రికార్డ్ ల మోత, అధ్బుతమైన క్యాచ్ లు ఉంటాయి. గాల్లో క్యాచ్ లు పట్టడం, సింగిల్ హ్యాండ్ తో పరుగెత్తి క్యాచ్ లు పట్టడం.. ఇలాంటివి ప్రేక్షకుల నుంచి చప్పట్లు కొట్టిస్తాయి. లేటెస్ట్ గా ఇంగ్లాండ్ యంగ్ స్టర్ జాకబ్ బెథెల్ పట్టిన ఓ క్యాచ్ వైరల్ అవుతోంది యార్క్ షైర్ తో జరిగిన టీ20లో జాకబ్ బెథెల్ డైవ్ చేస్తూ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది
జూన్ 22న బర్మింగ్ హామ్ బేర్స్ యార్క్ షైర్ మద్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 181 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన యార్క్ షైర్ క్వార్టర్ ఫైనల్ లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో 27 పరుగులు కావాలి. ఇంకా రెండు వికెట్లు చేతిలో ఉన్నాయి. డేవిడ్ వైస్, హెన్రీ బ్రూక్స్ మూడు సిక్సులు కొట్టారు. ఇంకా విజయానికి రెండు బంతుల్లో 12 పరుగులు కావాలి. అయితే ఛేజింగ్ లో 19 ఓవర్ రెండో బంతికి డాన్ మౌస్లీ వేసిన బాల్ ను జోర్డాన్ థాంప్సన్ బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు. అపుడు జాకబ్ బెథెల్ పరుగెత్తుతూ డైవ్ కొట్టి లెఫ్ట్ హ్యాండ్ తో ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల నుంచి చప్పట్లు మార్మోగాయి. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు ఓపెనర్ రాబ్ యేట్స్ 51 బంతుల్లో 66 పరుగులు చేయడంతో బర్మింగ్‌హామ్ 180-7 పరుగులు చేసింది.
వెస్టిండీస్‌లో జరిగిన 2022 ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ కు బెథెల్ ఇంగ్లాండ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు
https://twitter.com/WarwickshireCCC/status/1671982067414867972