వలస కూలీలు నడిచి వెళ్లకుండా చూసుకోండి

వలస కూలీలు నడిచి వెళ్లకుండా చూసుకోండి
  • రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు
  • ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని లెటర్‌‌

న్యూఢిల్లీ: రైల్వే ట్రాకులు, రోడ్ల వెంట ఏ ఒక్క వలస కూలీ నడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. నడిచి వెళ్లే వాళ్లను గుర్తించి వెంటనే వాళ్ల కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్‌ భల్లా రాష్ట్రాల సీఎస్‌లకు లెటర్‌‌ రాశారు. రైల్వే శాఖతో చర్చలు జరిపి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి వాళ్లను సొంతూళ్లకు పంపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏ ఒక్క వలస కూలీ నడచి వెళ్లేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూలీలకు సంబంధించిన తిండి, శానిటేషన్‌, క్వారంటైన్‌ సెంటర్లు తదితర ఏర్పాట్లు చూసుకోవాలని ఆదేశించారు. సోమవారం అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు పంపిన లెటర్‌‌లను అజయ్‌ మంగళవారం ట్వీట్టర్‌‌లో పోస్ట్‌ చేశారు.