న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరగడంతో కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించాయని, ముఖ్యంగా ఎంట్రీ లెవెల్‌లో హైరింగ్ యాక్టివిటీ పడిపోయిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ (ఐసీఆర్‌ఐఈఆర్) ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఓపెన్ ఏఐ సాయంతో 2025 నవంబర్ నుంచి 2026 జనవరి మధ్య 10 నగరాల్లోని 650 ఐటీ కంపెనీల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ రిపోర్ట్‌ను తయారు చేసింది. 63శాతం కంపెనీలు డొమైన్ స్కిల్స్, ఏఐ లేదా డేటా స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు డిమాండ్ పెరిగిందని తెలిపాయి.
పనుల్లో ఏఐ వాడకం పెరగడంతో హైబ్రిడ్ స్కిల్ సెట్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది. రిపోర్ట్ ప్రకారం, ఎంట్రీ లెవెల్లో నియామకాలు తగ్గినా, మధ్య, సీనియర్ స్థాయిల్లో నియామకాలు నిలకడగా ఉన్నాయి. ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గడం కాకుండా, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు వంటి పాత్రలకు డిమాండ్ పెరిగింది. బిజినెస్‌ల ప్రొడక్షన్ తక్కువ ఖర్చుతో ఎక్కువగా పెరిగింది. ఏఐ శిక్షణలో కంపెనీలు వెనకబడి ఉన్నాయి.
