రూ.788 కోట్లకు చేరిన పీఎఫ్ బకాయిలు..టైం అడిగిన ఆర్టీసీ అడ్వైజర్

రూ.788 కోట్లకు చేరిన పీఎఫ్ బకాయిలు..టైం అడిగిన ఆర్టీసీ అడ్వైజర్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ బకాయిలు చెల్లించేందుకు కొంత టైం ఇవ్వాలని పీఎఫ్ రీజినల్ కమిషనర్ చంద్రశేఖర్ ను ఆర్టీసీ ఫైనాన్సియల్ అడ్వైజర్ రమేష్ కోరారు. ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు జమ కావాల్సిన పీఎఫ్ చెల్లించలేదని, ఆ మొత్తం ఇప్పుడు రూ.788 కోట్లకు చేరుకుందని, దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీ సునీల్ శర్మను పీఎఫ్ అధికారులు ఇదివరకే కోరారు. ఈ మేరకు ఎండీ తరఫున ఆర్టీసీ ఫైనాన్సియల్ అడ్వైజర్ రమేష్ శుక్రవారం హాజరయి వివరణ ఇచ్చారు. సమ్మె నడుస్తుండటం, సంస్ధ దగ్గర నిధుల కొరత వల్ల ఇప్పుడు చెల్లించలేమని, కొంత సమయం ఇవ్వాలని పీఎఫ్ అధికారులను కోరినట్లు, అందుకు పీఎఫ్ అధికారులు అంగీకరించినట్లు తెలిసింది.