మేం కల్లు అందుకే తాగినం.. చిల్లర కామెంట్స్ చేయొద్దు

మేం కల్లు అందుకే తాగినం.. చిల్లర కామెంట్స్ చేయొద్దు

కల్లు ప్రత్యేకత చెప్పేందుకే కల్లు తాగామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కూల్ డ్రింక్స్ కంటే కల్లు శ్రేష్టమైందని..దీనిపై చిల్లర కామెంట్స్ చేయొద్దన్నారు. పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా ఉందని.. దానిని తాముకూడా ఒప్పుకోబోమన్నారు. కేసీఆర్ కు ఉద్యోగుల కష్టాలు తెలుసుకాబట్టి సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు.  ఉద్యోగుల పీఆర్సీ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పీఆర్సీ సాధించుకుందామన్నారు. 43%శాతం పీఆర్సీ ఇచ్చినప్పుడు కొందరు తలలు బాదుకున్నారు.. ఇప్పుడు వాళ్లే పీఆర్సీ ఇవ్వట్లేదని మొత్తుకుంటున్నారన్నారు.  తెలంగాణ వచ్చాక ఉద్యోగుల ఎవరూ సరిగా పనిచేయడం లేదని ప్రచారం చేస్తున్నారన్నారు.  ఉద్యోగులు పనిచేస్తున్నారు కాబట్టే తెలంగాణలో అభివృద్ధి జరుగతోందన్నారు.  పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు అన్యాయం జరగదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం కేసీఆర్ మనుసున్న మారాజని.. ఉద్యోగుల పీఆర్సీ విషయంపై కేటీఆర్, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

see more news

ఘోర రోడ్డు ప్రమాదం : పెళ్లికూతురు సహా ఐదుగురు మృతి

ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు.. వెంటనే బెయిల్

ఢిల్లీలోని ఇజ్రాయల్ ఎంబసీ దగ్గర భారీ బాంబు పేలుడు