V6 News

6 నెలలుగా తాగునీళ్లు వస్తలేవ్.. ఖాళీ బిందెలతో మహిళలు నిరసన

6 నెలలుగా తాగునీళ్లు వస్తలేవ్.. ఖాళీ బిందెలతో మహిళలు నిరసన

ఘట్‌‌కేసర్, వెలుగు: ఆరు నెలలుగా తాగు నీళ్లు రావట్లేదంటూ పోచారం మున్సిపాలిటీ 11వ వార్డు సాయిగణేశ్ నగర్ కాలనీ మహిళలు, చిన్నారులు ఖాళీ బిందెలతో శుక్రవారం నిరసన తెలిపారు. తాగునీళ్లు రావట్లేదని స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, వాటర్ బోర్డు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.  కాలనీ ఏర్పడి ఐదేండ్లు కావొచ్చిందని, అయినా కనీస వసతులైన  డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు లేక తిప్పలు పడుతున్నామని వాపోయారు.  పైప్​లు వేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నీటి కనెక్షన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. స్థానిక కౌన్సిలర్ లక్ష్మీ ఇప్పటివరకు కాలనీకి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.