టీమిండియా మాజీ క్రికెటర్‌కు ఓ గ్రామ సర్పంచ్ జరిమానా విధించారు. ఆ సర్పంచ్ ఆదేశాలతో రూ.5 వేల జరిమానా చెల్లించాడు. గోవా ఉత్తర ప్రాంతంలో అల్డోనాలో మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఇళ్లు ఉంది. గోవా పర్యాటక ప్రదేశం కావడంతో చెత్తా,చెదారం ఎక్కువగా పడుతుంది. ఇందులో బాగంగానే జడేజా ఉండే గ్రామానికి సమీపంలోని నచినోలాలో విపరీతంగా చెత్త పారేస్తున్నారు. దీంతో ఆ చెత్త ఎవరు పారేస్తున్నారో తెలుసుకునేందుకు కొందరు యువకులను నియమించారు ఆ గ్రామ సర్పంచ్ . అక్కడ ఉన్న ఓ సంచిలో అజయ్ జడేజా పేరు కనిపించింది. దీంతో ఆయనకు రూ.5 వేలు జరిమానా విధించినట్లు ఆ గ్రామ సర్పంచ్ తృప్తి బండోద్కర్ తెలిపారు. ఓ గొప్ప క్రికెటర్ తమ ఊరి పక్కనే ఉంటున్నందుకు తాము గర్విస్తున్నామని..అయితే నిబంధనలు అందరూ పాటించాల్సిందేనని అన్నారు. జడేజాకు విధించిన జరిమానాను ఎలాంటి వివాదం లేకుండా చెల్లించారని చెప్పారు.

