- రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ఎన్నికల్లో పాల్గొనబోయే ఎక్స్అఫీషియో సభ్యుల పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 07 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఈ నెల16న పరోక్ష ఎన్నికలు నిర్వహించి మేయర్, మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ పరోక్ష ఎన్నికలలో పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్అఫిషియో సభ్యులుగా హాజరుకావడానికి అవకాశం ఉందని చెప్పారు.
ఆయా జిల్లాలో నమోదైన ఎక్స్ అఫీషియో సభ్యుల వివరాలను తెలియపరుస్తూనే కొత్తగా నమోదు చేసుకోవాల్సిన వారి పేర్లు, పూర్తి వివరాలను 14వ తేదీ లోపు సేకరించాలని ఆదేశించారు. గెజిట్ విడుదల చేసే సమయానికి వివరాలన్ని అందచేయాలని పేర్కొన్నారు.
