బెల్లంతో అద్భుతమైన ప్రయోజనాలు

బెల్లంతో అద్భుతమైన ప్రయోజనాలు

రోజు వారీ పనులతో అంతా బిజీ అవుతున్నారు. పని ఒత్తిడిలో కొందరు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం మర్చిపోతున్నారు. దీంతో వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు దరి చేరకుండా ఉంటాయి. చిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా బెల్లం తినడం తో ఎన్నో వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. బెల్లంతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.

…బెల్లం తినడంతో గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది

…భోజనం చేసిన తర్వాత  స్వీట్ తినాలని అన్పిస్తే… అన్నిటిని మించి బెల్లాన్ని తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది

…బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి  చేసి మెటబొలిజం ని క్రమబద్దీకరణ చేస్తుంది.

…ప్రతిరోజూ ఒక గ్లాసు పాలల్లో గానీ నీటి తో గానీ బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం తర్వాత తప్పనిసరి చేయాలి.

…బెల్ల లో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం ఎంతో అవసరం.

…చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్ల ను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలను నివారిస్తుంది.

బెల్లంలోని మరో గుణం వేడిచేయడం. దీన్ని జలుబు ,దగ్గు, రొంప లాంటివాటికి ఉపశమనం ఇస్తుంది. జలుబు చేస్తే.. బెల్లం తిన్నా… చాయ్ లేదా లడ్డు లో కూడా బెల్లాన్ని కలిపి సేవించవచ్చు.

…శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే, బెల్లం తిన్నట్లయితే ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతాయి. అంతేకాదు షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసట గా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినాలి.

…బెల్లం శరీర ఉష్ణోగ్రత ని అరికడుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.

…మోకాళ్ళ నొప్పుల కి విశ్రాంతి, బెల్లం ముక్క తో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

…బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు,మాట స్పష్టంగా ఉంటుంది.

…బెల్లాన్ని నల్లనువ్వుల తో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది  ఉండదు.

…బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

…అన్నం తిన్న తర్వాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుంది.

…5 గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లం ఉండలు గా చేసి తీసుకొంటే జాండిస్ ను అరికట్టవచ్చు.

…బెల్లం హాల్వా తీసుకొంటే  జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

..5 గ్రాముల బెల్లం అంతే పరిమాణంలోని ఆవాల నూనె తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.