సముద్రంలో పోటీ కేవలం చమురుకే పరిమితం కాదు.. భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వృద్ధిని శాసిస్తుంది: నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి

సముద్రంలో పోటీ కేవలం చమురుకే పరిమితం కాదు.. భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వృద్ధిని శాసిస్తుంది: నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు  కొనసాగుతున్న క్రమంలో ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు సముద్రంలో పోటీ కేవలం చమురు, ఇంధనంపైనే ఉంది.. ఇకపై అది భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వృద్ధిని శాసించే ,తీర్చిదిద్దే ఇతర కీలక వనరులపై ప్రభావం చూపుతుందని అన్నారు.  సముద్ర జలాలపై పెరుగుతున్న ఆధిపత్య పోరుపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు త్రిపాఠి. 

ప్రపంచ మహాసముద్రాలు ఇకపై కేవలం చమురు, గ్యాస్ వంటి సాంప్రదాయ ఇంధన ప్రయోజనాలకే పరిమితం కావని.. అవి భవిష్యత్ వ్యూహాత్మక పోటీకి ప్రధాన వేదికలుగా వేగంగా మారుతున్నాయని భారత నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి స్పష్టం చేశారు. గురువారం ఆయన సముద్ర జలాలపై పెరుగుతున్న ఆధిపత్య పోరు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న క్రమంలో అత్యంత కీలకమైన  హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలకు ఏర్పడుతున్న అంతరాయాలపై మాట్లాడిన ఆయన ఈ హెచ్చరికలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. హోర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన అంతరాయాలు కేవలం రవాణా సమస్యలు కావు. ఇవి ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని, ఇంధన అస్థిరతను సృష్టించాయి అని అడ్మిరల్ త్రిపాఠి అన్నారు.  సముద్రాల్లో ఆధిపత్య పోటీ అనేది కేవలం చమురు, ఇంధనానికే పరిమితం కాలేదని.. భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వృద్ధిని శాసించే ,తీర్చిదిద్దే ఇతర కీలక వనరుల ప్రభావితం చేసే దిశంగా ఈ పోరు విస్తరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

సముద్ర మార్గం ద్వారా జరిగే ప్రపంచ ముడి చమురు రవాణాలో సుమారు ఐదవ వంతు (20%) ఈ ఇరుకైన హోర్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ప్రస్తుతం పశ్చిమాసియా లో నెలకొన్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ జలమార్గం గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. తాజా పరిస్థితులు కేవలం ఇంధన సరఫరానే కాకుండా, మొత్తం ప్రపంచ వాణిజ్య భద్రతను ఎలా ప్రభావితం చేస్తాయన్న దానికి ఈ పరిణామాలు ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయని అడ్మిరల్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.