మంత్రి వివేక్ కు కృతజ్ఞతలు తెలిపిన భౌద్ధ కౌన్సిల్ బృందం

మంత్రి వివేక్ కు కృతజ్ఞతలు తెలిపిన భౌద్ధ కౌన్సిల్ బృందం

 మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు బౌద్ధ కౌన్సిల్ ప్రతినిధులు. ధమ్మ యాత్రకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ధమ్మ యాత్రకు వివేక్  ఇచ్చిన ప్రోత్సహాన్ని అభినందించారు.  ఇటీవల కర్ణాటక, తెలంగాణ, ఏపీలో ధమ్మయాత్ర జరిగింది. కర్ణాటకలో ప్రారంభమైన ధమ్మ యాత్ర నాగార్జున్ సాగర్ లో ముగిసింది. 

భారతదేశంలో బౌద్దాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో  60 మంది థాయ్‌‌లాండ్  బౌద్ద భిక్షువులు, వారితో పాటు మరో 10 మంది  భారతీయ బౌద్ధులు, ఉపాసకులు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘బుద్ద దమ్మ పాదయాత్ర’ చేపట్టారు.  ఫిబ్రవరి 2న కర్నాటకలోని గుల్బర్గాలోని  సిద్ధార్థ  బుద్ద విహార్​ నుంచి ప్రారంభమైన పాదయాత్ర 450 కిలోమీటర్లు కొనసాగి మార్చి 1న నాగార్జునసాగర్ లోని బుద్ధ వనంలో ముగించారు.  థాయ్‌‌లాండ్‌‌కు చెందిన సంగ ప్రాజెక్ట్  డైరెక్టర్  సోంగ్‌‌శాక్  కోవిడో నాయకత్వంలో ముంబైకు చెందిన బాలీవుడ్  నటుడు గగన్  మాలిక్  సమన్వయంతో  యాత్ర సాగింది. 

ధమ్మ యాత్రకు వివేవ్ ఇచ్చిన ప్రోత్సహాన్ని అభినందించారు. ఇటీవల కర్ణాటక, తెలంగాణ, ఏపీలో ధమ్మయాత్ర జరిగింది. కర్ణాటకలో ప్రారంభమైన ధమ్మ యాత్ర నాగార్జున్ సాగర్ లో ముగిసింది.