చేవెళ్ల, వెలుగు: కల్లును రాష్ట్ర పానీయంగా ప్రకటించాలని.. బార్లు, పబ్బులు, స్టార్ హోటళ్లలో విక్రయాలకు అనుమతించాలని ఎక్స్‌పీరియం పార్క్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ రామడుగు రామ్ దేవ్ రావు డిమాండ్ చేశారు.
మే 24న నిర్వహించాల్సిన ‘టాడి మ్యూజిక్ ఫెస్టివల్’పై గౌడ సంఘాల నేతలు చేసిన విమర్శలకు స్పందిస్తూ శుక్రవారం ఎక్స్‌పీరియం పార్క్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఫెస్టివల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కల్లుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కల్లును ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో టాడి మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించాలని అనుకున్నట్లు చెప్పారు. కల్లును రాష్ట్ర పానీయంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
