తృణ ధాన్యాల ఉత్పత్తిలో వెనుకబాటుతోనే దేశంలో పోషకాహార లోపం : వ్యవసాయ నిపుణుడు ప్రభు ఎల్.పింగళి

తృణ ధాన్యాల ఉత్పత్తిలో వెనుకబాటుతోనే దేశంలో పోషకాహార లోపం : వ్యవసాయ నిపుణుడు ప్రభు ఎల్.పింగళి
  •     అంతర్జాతీయ వ్యవసాయ నిపుణుడు ప్రభు ఎల్.పింగళి
  •     ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ అగ్రికల్చర్ వర్సిటీలో మెగా కాన్వొకేషన్

హైదరాబాద్, వెలుగు: 1960లో ఆహార కొరతను ఎదుర్కొన్న భారతదేశం.. హరిత విప్లవం ద్వారా ఆహారాన్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు, టాటా- కార్నెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ప్రభు ఎల్.పింగళి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్‌‌ అగ్రికల్చర్ వర్సిటీ గ్రౌండ్‌లో వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అధ్యక్షత మెగా కాన్వొకేషన్ ​కార్యక్రమం జరిగింది. 

దీనికి ముఖ్య​అతిథిగా హాజరైన ప్రభు మాట్లాడుతూ.. పప్పు ధాన్యాలు, తృణధాన్యాల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని, దేశంలో పోషకాహార లోపానికి ఇదే కారణమన్నారు. సాగు పద్ధతులు, పంటల విధానాలు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్నాతకోత్సవంలో 2,135 మంది యూజీ, 480 మంది పీజీ, 129 మంది పీహెచ్‌డీ అభ్యర్థులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ప్రభు పింగళికి వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.