కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ అమలులో ఉంది. జనం ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ తో వీధి కుక్కల ప్రవర్తనలో చిన్నచిన్న మార్పులు వచ్చే చాన్స్ ఉందని పలువురు యానిమల్ యాక్టివిస్టులు అభిప్రాయపడుతున్నా రు. జనసంచారం లేకపోవడం వల్ల కొన్ని వీధి కుక్కలు కన్ఫ్యూజన్ లోకి వెళ్లిపోతాయని అంటున్నా రు. రోడ్ల మీద జనం తిరగకపోవడం వల్ల ఆహార కొరత ఏర్పడి వీధికుక్కల్లో పోటీ పెరుగుతుందని ఢిల్లీకి చెందిన పాట్రిక్స్(డాగ్స్ ట్రెయినిం గ్ సెంటర్) సంస్థ పౌండర్ ఆకాన్ష్ యాదవ్ చెప్పింది. వీధి కుక్కలకు, ముఖ్యంగా మార్కెట్లలో సంచరించే వాటికి ఇది నిజంగా కష్టకాలమని ఆమె పేర్కొంది. రోడ్ల మీద జనం లేకపోవడంతో అసలు ఏం జరిగిందో తెలియక వీధి కుక్కలన్నీ గందరగోళంలో ఉన్నాయని యానిమల్ యాక్టివిస్ట్ సంగీత దొగ్రా చెప్పుకొచ్చింది . అయితే జన సంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరిగే కుక్కలు మాత్రం ప్రస్తుత పరిస్థితిని ఎంజాయ్ చేస్తాయని చత్త్ పూర్ లోని డ్రాగ్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించే అద్నాన్ ఖాన్ అంటున్నాడు. తమను అడ్డుకునే వాళ్లు, కొట్టేవాళ్లులే కపోవడంతో వీధి కుక్కలు ప్రస్తుతం చాలా ఆనందంగా ఉంటాయని, జన సంచారం వాటికెప్పుడూ ఇబ్బందే అని అద్నాన్ అన్నాడు.

