పాన్‌కార్డు-ఆధార్ అనుసంధానం గడువు తేదీ ఈ నెల 30

పాన్‌కార్డు-ఆధార్ అనుసంధానం గడువు తేదీ ఈ నెల 30

పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో అనుసంధానానికి ఇచ్చిన గడువు ఈనెల 30తో ముగియనుంది. ఆ తర్వాత ఆధార్‌తో అనుసంధానం కాని పాన్ కార్డులను రద్దు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే వారు ఆ సందర్భంగా  తెలిపే ఆధార్ సంఖ్యతో కొత్త పాన్‌ నంబరును జారీ చేస్తామని తెలిపారు. గడువుకు ఇంకా మూడు రోజుల సమయం ఉందని.. వెంటనే పాన్ నంబరుతో ఆధార్‌కార్డును జత చేసుకోవాలని అధికారులు సూచించారు.