అదానీతో శ్రీలంక విద్యుత్ కొనుగోలు ఒప్పందం

అదానీతో శ్రీలంక విద్యుత్ కొనుగోలు ఒప్పందం

కొలంబో: ద్వీపదేశం శ్రీలంక 484 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి అదానీ గ్రీన్ ఎనర్జీతో 20 సంవత్సరాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ప్రతి కిలో వాట్ అవర్​కు  0.0826 డాలర్ల చొప్పున అదానీ కంపెనీకి తమ కరెన్సీలోనే చెల్లిస్తామని లంక ఇంధన మంత్రి కాంచన విజయశేఖర తెలిపారు. కొనుగోలు ఖర్చు కిలో వాట్ అవర్​కు 39.02 శ్రీలంక రూపాయలు అవుతుందని, ఇది ప్రస్తుత సగటు ఇంధన ధర కంటే తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. మన్నార్,  పూనేరిన్‌‌‌‌లలో 484 మెగా వాట్ల పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి  మార్చి 2022లోనే క్యాబినెట్ ఆమోదం లభించింది.