వరల్డ్ లోనే ఒకే ఒక్కడు..ఐదు మహాసంద్రాల లోతుకెళ్లాడు

వరల్డ్ లోనే ఒకే ఒక్కడు..ఐదు మహాసంద్రాల లోతుకెళ్లాడు
  • ప్రపంచంలో ఒకేఒక్కడుగా రికార్డు కొట్టేసిన విక్టర్​ వెస్కోవో
  • 40 కొత్త జీవజాతులను గుర్తించిన ‘ఫైవ్​ డీప్స్​ ఎక్స్​పెడిషన్​’ టీం

పిల్లవాగులను ఈదినోడికి సప్తసముద్రాలను ఈదడం కష్టమే కావొచ్చు. కానీ, ఆ సప్త సముద్రాలను ఈదినోళ్లకు ఆ పిల్లవాగులు ఓ లెక్కా! కాదు కదా! అమెరికాకు చెందిన ఓ వ్యక్తి అలాంటి ఓ సాహసమే చేశాడు. భూమండలంపై ఉన్న అన్ని మహా సముద్రాల లోతును చూసేశాడు. ఐదు మహాసంద్రాల్లో అత్యంత లోతుకు డైవింగ్​ చేశాడు. ఈ సాహసం చేసిన ‘ఒకేఒక్కడు’గా నిలిచి రికార్డు కొట్టేశాడు. అతడి పేరు విక్టర్​ వెస్కోవో. ఐదు మహాసంద్రాల్లోని అత్యంత లోతైన ప్రాంతాలకు వెళ్లిన మొదటి వ్యక్తిగా గుర్తింపు సాధించాడు. 10 నెలల్లో పసిఫిక్​, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసంద్రం, అట్లాంటిక్​, ఆర్కిటిక్​ మహాసంద్రాల్లో లోతైన ప్రాంతాలను ఛేదించిన అతడు, రికార్డు సృష్టించాడు. చివరిగా ఆర్కిటిక్​ మొలాయ్​ ట్రెంచ్​లో 5.5 కిలోమీటర్ల లోతుకు వెళ్లాడు. అంతేకాదు, అట్లాంటిక్​లోని టైటానిక్​ షిప్పు దగ్గరికీ వెళ్లాడు.

ఎందుకు..? ఎలా?

‘ఫైవ్​ డీప్స్​ ఎక్స్​పెడిషన్​’ పేరిట విక్టర్​ ఓ టీంను రెడీ చేసుకున్నాడు. డైవింగ్​ కోసం 12 టన్నుల డీప్​ సీ వెహికల్​ (డీఎస్​వీ) లిమిటింగ్​ ఫ్యాక్టర్​ను వాడాడు. దాంతోపాటుగా సముద్రం లోపల ఏమున్నాయో తెలుసుకునేందుకు వీలుగా డీఎస్​ఎస్​వీ ప్రెజర్​ డ్రాప్​ అనే నేవీ సబ్​మెరీన్​ సాయం తీసుకున్నాడు. అయితే, ఇదేదో రికార్డుల కోసం కాకుండా, లోపల ఏముందో తెలుసుకుంటే మనిషి బతికేందుకు ఏదో ఒక విధంగా అది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ డైవ్​లు చేసినట్టు మాజీ నేవీ రిజర్విస్ట్​ అయిన వెస్కోవో చెబుతున్నాడు. ప్రయాణంలో భాగంగా100 ల్యాండర్లను మోహరించారు. వాటిని సముద్రం అడుగు భాగంలో ఏమున్నాయో తెలుసుకునేలా డిజైన్​ చేశారు. ఈ ప్రయాణంలో దాదాపు 40 కొత్త జీవజాతులను విక్టర్​ టీం కనుగొంది. అక్కడి నుంచి నీటి నమూనాలు సేకరించారు. జీవజాతుల ఫొటోలు తీశారు. సముద్రం అడుగున నీటిలో ఉండే ఉప్పు శాతం, ఉష్ణోగ్రతల వంటివి తెలుసుకోవడానికి ఈ నీటి నమూనాలు ఉపయోగపడతాయని చీఫ్​ సైంటిస్ట్​ డాక్టర్​ అలన్​ జేమీసన్​ తెలిపారు. డీఎస్​ఎస్​వీ ప్రెజర్​ డ్రాప్​, మహాసంద్రాల అడుగు భాగాన్ని మ్యాప్​ చేసిందన్నారు. అది మ్యాప్​ చేసిన ప్రాంతం దాదాపు 3 లక్షల చదరపు కిలోమీటర్లు.  ఇటలీ దేశంతో సమానమన్నారు. డీప్​ సీ డైవింగ్​కు కావాల్సిన టెక్నాలజీనీ విక్టర్​ టీం ప్రపంచానికి పరిచయం చేసింది. దాదాపు 74 వేల కిలోమీటర్లు ప్రయాణించిన టీం, ఆగస్టు 24న జర్నీ ముగించింది.  ఉత్తర, దక్షిణ ధ్రువాలకూ వెస్కోవో వెళ్లాడు. పర్వతాలూ ఎక్కేశాడు. ఇప్పుడు మహాసముద్రాల లోతునూ చూసేశాడు.