
బాంబు పేలి ఓ వీధి కుక్క చనిపోయింది. తిని వస్తువు అనుకుని నోట పట్టుకోవడంతో పేలింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఇవాళ (గురువారం) ఓ కుక్క తినే వస్తువు అనుకుని రోడ్డుపై ఉన్న బాంబును నోట కరుచుకుని వెళుతుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ కుక్క చనిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టిన పోలీస్ అధికారులు.. అసలు ఈ బాంబు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? స్థానికంగా ఏమైనా తయారు చేస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.