స్కిన్ కేర్ అనేది డెయిలీ రొటీన్లో భాగం. చర్మం మీద వయసు నీడ పడకుండా ఉండేందుకు బోలెడన్ని టిప్స్, ట్రిక్స్ పాటిస్తుంటారు చాలామంది. అందులో భాగంగా సెలూన్ ట్రీట్మెంట్స్ కోసం వెళ్లడం మామూలే. వాటిలో చాలా కామన్ ఫేషియల్. అయితే ఇది చర్మానికి ఎంతవరకు సేఫ్ అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఇప్పటివరకు ఆలోచించకపోతే... ఇక మీదట ఆలోచించాల్సిందే. ప్రొఫెషనల్ ఫేషియల్‌లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అందులో చర్మాన్ని శుభ్రం చేయడం. స్కిన్ టైప్ తెలుసుకోవడం, బ్లాక్‌హెడ్స్ తీసేయడం, ఫేషియల్ మసాజ్ వంటివి ఉంటాయి. ట్రీట్మెంట్లో భాగంగా మాస్క్, సీరమ్స్ రాస్తారు. ఫేషియల్‌లో భాగంగా చేసే ఈ పద్ధతుల వల్ల చర్మం బాగుంటుంది. మానసికంగా కూడా ఉత్తేజంగా అనిపిస్తుంది అనుకుంటాం. కానీ ఇవే ఫేషియల్స్ శరీరానికి హానికరం.
హార్మోన్ లెవల్స్
మసాజ్ వల్ల స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ తగ్గి, ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కావడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది అనుకుంటారు. కానీ, ఈ విషయం మీద జరిగిన పరిశోధనల్లో మాత్రం మసాజ్ వల్ల శరీరంలోని హార్మోన్స్‌లో ఎటువంటి మార్పు ఉండదని తేలింది.
మార్కెటింగ్ మాయాజాలం
అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్ ప్రకటనల్లో యాంటీఆక్సిడెంట్ ఫేషియల్స్‌లో ఫ్రీ రాడికల్ ఫైటింగ్ న్యూట్రియెంట్స్ ఉంటాయని చెప్తారు. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేస్తాయని చెప్తారు. నిజానికి స్పాలో వాడే ఏ ప్రొడక్ట్ కూడా శరీరంలోపల సర్క్యులేషన్లోకి వెళ్లదు. ఒకవేళ అలాకానీ వెళ్లిందంటే వాటిని డ్రగ్స్ కింద లెక్క కట్టాలి. అలాంటప్పుడు వాటివల్ల జరిగే లాభమేంటో మీరే ఆలోచించుకోవాలి.
ఫ్లూయిడ్ ఏర్పడటం
కొన్ని ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల ఎక్స్ఫోలియేషన్, మైల్డ్ ఎడిమాలకు దారి తీస్తాయి. ఇలా జరగడానికి కారణం ఫేషియల్ ప్రొడక్ట్స్‌లో వాడే కొన్ని రకాల యాసిడ్స్. వాటివల్ల శరీరంలో నీరు చేరుతుంది. మరీ ముఖ్యంగా కిడ్నీ జబ్బులు, హైపర్‌టెన్షన్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లు ఫేషియల్స్ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫేషియల్ తర్వాత చర్మం మీద దద్దుర్లు, దురద ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. ఈ జాగ్రత్తలతో పాటు ఫేషియల్కు వెళ్లే ముందు డాక్టర్ని కలిస్తే ఫేషియల్ వల్ల చర్మానికి కలిగే లాభనష్టాలు కూడా తెలుసుకోవచ్చు” అంటున్నారు జ్యోతి గుప్తా.
చర్మం మెరిసిపోవాలని, అందంగా కనిపించాలని ఫేషియల్స్ చేయించుకుంటుంటారు. కానీ, అవి చర్మాన్ని నిజంగానే మెరిసిపోయేలా చేస్తాయా? లేక సమస్య ఏదైనా ఉంటుందా? పైపైన చేయించుకునే ఫేషియల్ వల్ల జరిగే నష్టం ఏముంది అనిపిస్తుంది కదా! ఆ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు
డాక్టర్ జ్యోతి గుప్తా. ఈసారి మీరు ఫేషియల్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మొదట స్కిన్ డాక్టర్‌ను కలవండి. ఆ తరువాతే ఫేషియల్ చేయించుకోండని కాస్త గట్టిగానే చెప్తున్నారామె.
