పడవ ప్రమాదం తర్వాత ఒక చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ ఫొటోలో ఒక తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకుని నీటిలో మరణించి ఉన్నట్లుగా కనిపిస్తుంది.
అయితే, దర్యాప్తులో ఈ ఫొటో నిజమైనది కాదని తేలింది. ఇది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా సృష్టించిన చిత్రమని నిపుణులు వెల్లడించారు.
బార్గీ డ్యామ్‌లో పడవ ప్రమాదానికి, వైరల్ అవుతున్న ఈ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని జబల్ పూర్ కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.
