సైబరాబాద్లో నకిలీ పత్తి విత్తనాలు సీజ్... ఇద్దరు అరెస్ట్

  సైబరాబాద్లో  నకిలీ పత్తి విత్తనాలు సీజ్... ఇద్దరు అరెస్ట్

మేడ్చల్ జిల్లా షామిర్ పేట్ రాజీవ్ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు సైబరాబాద్ SOT పోలీసులు. 19 లక్షల విలువైన.. 12 వందల కిలోల నిషేధిత బీజీ-3 HT పత్తివిత్తనాలను పట్టుకున్నారు పోలీసులు. ఉల్లిపాయ సంచుల్లో నకిలీ పత్తివిత్తనాలను బొలేరో వాహనంలో తరలిస్తుండగా గుర్తించారు. నిషేధిత పత్తివిత్తనాలు రవాణా చేస్తున్న శ్రీకాంత్,  నవీన్ కుమార్  ను అరెస్ట్ చేశారు. బొలేరో వెహికిల్ తోపాటు రెండు సెల్ ఫోన్స్ సీజ్ చేశారు సైబరాబాద్ SOT పోలీసులు. ఇద్దరు నిందితులపై గతంలో కూడా నకిలీ పత్తి విత్తనాల రవాణా కేసులున్నాయన్నారు పోలీసులు.   మరోవైపు కూకట్ పల్లిలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటిచకుండా రవాణా చేస్తున్న రూ.  5,50,290 పట్టుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు.