మంత్రి గంగుల కమలాకర్‌కు నకిలీ ఈడీ నోటీసులు

V6 Velugu Posted on Aug 25, 2021

మంత్రి గంగుల కమాలకర్ కు గుర్తు తెలియని అగంతకులు నకిలీ ఈడీ నోటీసులు పంపించారు. ఆయన సోదరులను అరెస్ట్ చేస్తామని నకిలీ నోటీస్  పంపారు. అరెస్ట్ వద్దనుకుంటే ఈడితో మాట్లాడి సెటిల్ చేస్తామంటూ నోటీసులో తెలిపారు. దీంతో మంత్రి గంగుల ఈడి అధికారులను సంప్రదించారు. నకిలీ ఈడి నోటీసుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. అగంతకులపై 420,468,471 కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో బాగంగా గంగులకు సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఇప్పటి వరకు నకిలీ ఈడి నోటీస్ పై పోలీసులకు  ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

Tagged Minister Gangula Kamalakar, Fake ED notices

Latest Videos

Subscribe Now

More News