
ముంబై: వేధింపులు భరించలేక ఓ నటి చనిపోయిన సంఘటన ముంబైలో కలకలం రేపింది. గురువారం ఈ సంఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. నటి తన స్నేహితులతో కలిసి డిసెంబరు 20న ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీకి వెళ్లిందని.. అక్కడకు ఇద్దరు నకిలీ ఎన్సీబీ అధికారులు వచ్చి.. NCB అధికారులమంటూ అబద్ధం చెప్పారన్నారు. డ్రగ్స్ కేసులో ఆమె పేరు వెల్లడించకుండా ఉండాలంటే.. రూ.20 లక్షలు ఇవ్వాలని నటిని డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. పదే పదే ఫోన్ చేసి భయపెట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారని.. శుక్రవారం నిందితులు సూరజ్ మోహన్ పరదేశి(38), పర్వీన్ రఘునాథ్ వాలింబే(35)ను అరెస్టు చేశామన్నారు. వారిని విచారిచగా నిజం ఒప్పుకున్నారని వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు.. ఆ నటి పేరు మాత్రం వెల్లడించలేదు.