V6 News

హోటల్ లో అభిమాని సర్ ప్రైజ్ ..బాగోదన్న రోహిత్

హోటల్ లో అభిమాని సర్ ప్రైజ్ ..బాగోదన్న రోహిత్
కామన్ గా అభిమానులకు సెలబ్రిటీలు సర్ ప్రైజ్ ఇస్తారు… కానీ టీమిండియా ప్లేయర్లకే సర్ ప్రైజ్ ఇచ్చాడు ఓ అభిమాని. ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న టీమిండియా ప్లేయర్లు న్యూ ఇయర్ సందర్భంగా … ఓ హోటల్ కు వెళ్లారు. ఫుడ్ తిన్న తర్వాత అక్కడి సిబ్బందిని బిల్లు అడిగారు. అయితే అప్పడే తమ బిల్లు కట్టారని తెలిపారు హోటల్ సిబ్బంది. మీ వెనుక టేబుల్ పై కూర్చున్న నవల్ దీప్ సింగ్ అనే వ్యక్తి బిల్లు కట్టేసినట్లు తెలిపారు. దీంతో సర్ ప్రైజ్ అయ్యారు టీమిండియా ప్లేయర్లు.. భారత్ కు చెందిన నవల్ దీప్ సింగ్ మెల్ బోర్నోలో ఉంటున్నాడు. జనవరి 1న సింగ్ హోటల్ కు వెళ్లగా… పక్క సీట్లో టీమిండియా ప్లేయర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, నవదీప్ సైని, శుభ్ మన్ గిల్ ముందు టేబుల్లో కూర్చున్నారు. వారిని చూసి నవల్ దిప్ సింగ్… జనవరి ఫస్ట్ ను ఓ మంచి గుర్తుగా ఉంచుకోవాలని ఈ బిల్లు కట్టినట్లు తెలిపారు. టీమిండియా స్టార్స్ కు బిల్లు కట్టిన నవల్ దీప్ సింగ్ దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తాను బిల్లు చెల్లించినట్లు వాళ్లకి తెలియదు… నా సూపర్ స్టార్స్ కోసం ఆ మాత్రం చేయలేనా… అంటూ పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన రోహిత్… తాము తిన్న ఫుడ్ కు … మీరు చెల్లించటం బాగోదంటూ ర్వీ ట్వీట్ చేశారు. Bc mere saamne waale table par gill pant sharma saini fuckkkkkk pic.twitter.com/yQUvdu3shF — Navaldeep Singh (@NavalGeekSingh) January 1, 2021