కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెడుతున్నయ్: బోడ జనార్దన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెడుతున్నయ్: బోడ జనార్దన్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నాయని మాజీ మంత్రి, టీఆర్‌‌‌‌ఎస్ నేత బోడ జనార్దన్​​అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన టీఆర్‌‌‌‌ఎస్​ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా1.41 కోటి టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తే ఇప్పటివరకు అందులో సగం కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు.

మంత్రులు కమీషన్ల కోసం కక్కుర్తి పడి ధాన్యం కొంటలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారని, మంత్రులు మాత్రం మిగతా రాష్ట్రాల్లో కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామంటూ సంబరపడిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 20 వేల కొనుగోలు కేంద్రాలు పెట్టామని చెబుతున్నా.. కేంద్రం మాత్రం 7 వేల కేంద్రాలే ఉన్నాయంటున్నదని చెప్పారు. గోనె సంచులు లేకపోవడం, గోడౌన్ల కొరత, ట్రాన్స్‌‌పోర్ట్ ఇబ్బందులున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.