సికింద్రాబాద్, వెలుగు: ఫతేనగర్‌లో నిర్మిస్తున్న ఎస్టీపీ(సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) పనులు 80 శాతం పూర్తయ్యాయని వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్ తెలిపారు. ఆగస్టులోగా మిగతా పనులు పూర్తి చేసి దాన్ని ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫతేనగర్ ఎస్టీపీని సోమవారం దానకిశోర్ సందర్శించారు.
ఇన్లెట్, ఇతర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్టీపీ పనులు 20 శాతమే ఉన్నాయని.. మెషీన్ల బిగింపు సైతం మొదలైందన్నారు. అవసరమైతే కార్మికుల సంఖ్యను పెంచి మిగిలిన పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్టీపీ ఆవరణలో గార్డెనింగ్ కోసం అవసరమైన మొక్కలు నాటాలని సూచించారు.

