
1974, 1978, 2010లో రన్నరప్.. ఫిఫా ర్యాంక్ చూస్తే 8వ స్థానం..! ఇటీవల వరుసగా 15 మ్యాచ్‌ల్లో పరాజయమే ఎరుగని వైనం. ఇదీ నెదర్లాండ్స్ జట్టు రికార్డు. కానీ ఇప్పటి వరకు ఆ టీమ్ ఫిఫా వరల్డ్‌కప్‌ను ముద్దాడలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. అసలు సిసలైన ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ ఉన్నా.. నిలకడలేమితో కీలక మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్ తడబడుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఫిఫా కప్‌కు రెడీ అయిన డచ్ టీమ్.. అరబ్ గడ్డ ఖతార్‌లో కత్తిమీద సాముగా ఉండే పరిస్థితుల్లో ఎలా ఆడుతుందన్న ఆసక్తి మొదలైంది. గత పది వరల్డ్‌కప్స్‌లో ఈ టీమ్ గ్రూప్ దశను దాటింది. కానీ నాకౌట్ మొదలవుతుందంటే డచ్ ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుంది.
2010లో రన్నరప్‌గా నిలిచినా.. 2014లో థర్డ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. తర్వాతి వరల్డ్‌కప్‌కు కనీసం క్వాలిఫై కూడా కాలేదు. దీంతో టీమ్‌లో చాలా మార్పులు చేయడంతో గత 15 మ్యాచ్‌ల్లో 11 విజయాలతో సూపర్ ఫామ్‌లోకి వచ్చింది. ఈ వరల్డ్‌కప్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తే గ్రూప్ దశను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. స్ట్రాటజీలను రచించడంలో దిట్ట అయిన కోచ్ లూయిస్ మళ్లీ రావడం టీమ్‌కు కొండంత బలం. మరి ఈ సారైనా డచ్ జట్టు కప్పును ముద్దాడుతుందేమో చూడాలి.