మా తెలుగు రాష్ట్రాలకు ఏం ఇచ్చారు?.. కేంద్రాన్ని సభలో ప్రశ్నించిన ఎంపీ

మా తెలుగు రాష్ట్రాలకు ఏం ఇచ్చారు?.. కేంద్రాన్ని సభలో ప్రశ్నించిన ఎంపీ

వివరాలతో సమాధానం ఇచ్చిన ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎంత సహాయం ఇచ్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వేసిన ప్రశ్నకు ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. కరోనా సమయంలోనే కాదు.. ఎప్పుడు అవసరం వచ్చినా కేంద్రం స్పందించి సహాయం ఇస్తూనే ఉందని వివరాలు వెల్లడించారు. మంత్రి ఇచ్చిన సమాధానం వివరాలను ఎంపీ జీవీఎల్ మీడియాకు విడుదల చేశారు.

తెలుగు రాష్ట్రాలకి అందిన సహయం

1. కోవిడ్ ఆత్యవసర పరిస్థితులలో కేంద్రం నుంచి తెలంగాణ అందిన సహయం రూ. 353.13 కోట్లు, ఏపీకి రూ. 324.27 కోట్లు

2. జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమం ద్వారా తెలంగాణ‌కు అందిన సహాయం రూ. 523 కోట్లు, ఏపీకీ రూ.998.91 కోట్లు

3. విపత్తు నిర్వహణ కింద తెంలగాణ కు అందిన సహాయం రూ.449 కోట్లు, ఏపీకి రూ.1119.0 కోట్లు

4. రాష్ట్రానికి మూల‌ధ‌న వ్యయం కోసం తెలంగాణ‌కు రూ.358 కోట్లు కేటాయించ‌గా.. రూ.179 కోట్లు విడుద‌ల చేశారు, ఏపీకి రూ.688 కోట్లు కేటాయించ‌గా రూ.344 కోట్లు విడుద‌ల చేశారు.

5. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం ద్వారా తెలంగాణ‌ రాష్ట్రానికి 7,24,662 మెట్రిక్ టన్నుల ఆహార‌ధాన్యాలు స‌హాయం అంద‌గా.. 1 కోటి 80 లక్షల 62 వేల 980 మంది లబ్ది పొందారు. ఏపీకి 9,95,500 మెట్రిక్ టన్నుల ఆహార‌ధాన్యాలు స‌హాయం అంద‌గా.. 2,61,12, 304 మంది లబ్ది పొందారు

6. కేంద్రం నుంచి 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు తెలంగాణ‌కు పప్పు దినుసుల 15,804 మెట్రిక్ టన్నులు సహాయం అంద‌గా 52,68,030 లబ్దిపొందారు. ఏపీకి 66,492 మెట్రిక్ ట‌న్నులు అంద‌గా.. 90,28,190 మంది ల‌బ్ధిపొందారు.

7. ప్రధాన మంత్రి ఉజ్వల కార్యక్రమం ద్వారా కేంద్రం నుంచి తెలంగాణ‌కు అందిన సహాయం 130 కోట్లు, లబ్దిదారులు 18,74,717 మంది. ఏపీకి అందిన సాయం రూ.51 కోట్లు. ల‌బ్ధిదారులు 7,62,024 మంది

8.ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటి స్కీమ్ ద్వారా కేందం నుంచి తెలంగాణ‌కు అందిన సహాయం 8,682 కోట్లు, లబ్దిదారులు 1,30,127. అదేవిధంగా ఏపీకి 7,489 కోట్లు అంద‌గా 2,46,973 మంది ల‌బ్ధి పొందారు.

9. లాక్ డౌన్ సందర్బంగా వలస కూలీలకు కేందం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అందిన పప్పుదినుసుల సహాయం 180 కోట్ల మెట్రిక్ టన్నులు, 35,991 మంది లబ్దిదారులు. ఏపీకి రూ.7 కోట్లు అంద‌గా.. 1,360 మంది లబ్ధిపొందారు.

10. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా తెలంగాణ‌లో 33,31,468 మంది, ఏపీలో 46,95,820 మంది లబ్ది పొందారు.

11. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కార్యక్రమం ద్వారా తెలంగాణ‌లో 52,60,800 మంది , ఏపీలో 60,13,565 మంది లబ్దిపొందారు.

12.ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ద్వారా తెలంగాణ‌కు 102.3362 కోట్ల సహాయం అందగా.. 1,78,225 లబ్దిపొందారు. అదేవిధంగా ఏపీలో 116.5114 కోట్ల సాయ‌మంద‌గా 1,85,512 ల‌బ్ధిపొందారు.

13.నేషనల్ సోషల్ ఆసిస్టేంట్ కార్యక్రమం ద్వారా తెలంగాణ‌లో 6,65,956 మంది, ఏపీలో 9,32,661మంది ల‌బ్ధిపొందారు

14. భవన నిర్మాణ కార్మికుల కోసం కేంద్రం తెలంగాణ‌కు అందించిన సహాయం 124, కోట్లు, లబ్దిదారులు 8,30,324. అదేవిధంగా ఏపీకి అందించిన సాయం రూ.196 కోట్లు..ల‌బ్ధిదారులు 19,67,484 మంది.