మీ జన్మదినం తెలంగాణకు పండుగ రోజు

మీ జన్మదినం తెలంగాణకు పండుగ రోజు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరిందని, భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారిందని, మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతుందని ఆయన తెలిపారు. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నాయని, మీరు కారణజన్ములు ఆయన చెప్పారు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అని, తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తోందని హరీష్ రావు అన్నారు. ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్లు హరీష్ రావు పేర్కొన్నారు.