ఇల్లు దొరకడం ఈజీనే..షిప్టింగే కష్టం

ఇల్లు దొరకడం ఈజీనే..షిప్టింగే కష్టం

లాక్ డౌన్ తో లక్షల మంది సొంతూళ్లకు వెళ్లిపోవడంతో సిటీలో టు లెట్ బోర్డులు వేలాడుతూనే ఉన్నాయి. ఇలాంటి టైమ్లో ఎప్పటి నుంచో నచ్చినట్టు ఉన్న మరో ఇంటికో,ఆఫీసుకు దగ్గరగా ఉన్న ఏరియాకో మారాలనుకున్న వారికి పోర్షన్లు ఈజీగా దొరకుతున్నా.. షిఫ్టింగే కష్టంగా మారింది. సామాను తరలించేందుకు లేబర్, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

లేబర్ లేక డబుల్ కాస్ట్

సిటీ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ సర్వీసెస్ సంస్థలు 50కిపై గా ఉన్నాయి. సింగిల్ బెడ్రూం నుంచి లగ్జరీ విల్లా వరకు హోం షిప్టింగ్ సేవలందిస్తున్నాయి. వెహికల్, లేబర్, ప్యాకింగ్, షిప్టింగ్ వరకు అన్నీవాళ్లే చూసుకుంటారు. ఆ సంస్థల్లో పనిచేసే లేబర్లో ఇతర రాష్ట్రాలవారే ఎక్కువకాగా,లాక్డౌన్తోవాళ్లు సొంతూళ్లకు వెళ్ళిపోవడంతో  లోకల్ గా  దొరికే కొద్ది మందితో సేవలందిస్తున్నారు. చార్జీలు డబుల్ వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉండే డబుల్ బెడ్రూమ్ సామానును 30కిలోమీటర్ల దూరంలోని ఇంటికి నలుగురు కూలీలతో తరలించాలంటే అన్ని కలిపి రూ.5వేల నుంచి 7వేల దాకా చార్జ్ చేసేవారు. సామాన్లను బట్టి రూ. 15వేల దాకా తీసేకునేవారు. ఇప్పుడు లేబర్ షార్టేజ్ షార్టే కారణంగా ఇద్దరు మనుషులను పంపేందుకు రూ.8వేల నుంచి 12వేల దాకా డిమాండ్ చేస్తున్నారు.

అసోసియేషన్ల అబ్జెక్షన్

కరోనా భయంతో మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కూకట్పల్లి, బంజారాహిల్స్ వంటి ఏరియాల్లో బయటి వెహికల్స్, కొత్త వ్యక్తులను అపార్మట్ మెంట్లలోకి రానివ్వడం లేదు. కొత్త ఇంటికి మారాలన్నా కొన్ని వెల్ఫేర్ సొసైటీలు అబ్జెక్షన్ చెప్తున్నాయి. హైటెక్ సిటీకి దగ్గరగా ఉండే భిక్షపతినగర్లోని ఓ గేటేడ్ కమ్యూనిటీలో ఉండే శ్రీనివాసరావు అగ్రిమెంట్ పూర్తవడంతో వెకేట్ చేయాల్సి వచ్చింది. అపార్ట్ మెంట్ కమిటీ పర్మిషన్ తీసుకోవడానికే వారం పడితే, లేబర్ రావడానికి మరో రెండ్రోజులు పట్టింది. మరికొన్నిచోట్ల ఓనర్లు కొత్తవారికి రెంట్ కు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వచ్చే రెంటు పోతుందని ఇల్లు కూడా ఖాళీ చెయ్యని వ్వడం లేదు.

అవుటర్స్ ని రానిస్తలేం..

లాక్ డౌన్ నుంచి బయటి వ్యక్తు లను అపార్టు మెంట్లోకి రానివ్వడం లేదు. 80 ఫ్లాట్లలో 40కిపైగా రెంటల్ హోమ్స్ ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఉద్దేశంతోనే హౌస్ మేడ్స్, మిల్క్, పేపర్ బాయ్స్ తోపాటు శానిటేషన్ పనులు చేసేవారిని తాత్కాలికంగా రావద్దన్నాం . పోర్షన్లు ఖాళీగా ఉన్నా కూడా కొత్తగా ఎవరికీ పోర్షన్ రెంట్కు ఇవ్వడం లేదు. -రాజిరెడ్డి,మాదాపూర్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్