
బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్వార్థ రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గత సర్కార్ తడిచిన వడ్లను కొనలేదని విమర్శించారు. తాము తడిచిన ధాన్యాన్ని ఎమ్మెస్పీ రేటుకే కొంటున్నామని తెలిపారు. 15 రోజుల ముందు నుంచి వడ్లు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని చెప్పారు. మే 21 2024 మంగళవారం నాడు గాంధీభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బీఆర్ఎస్ బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడొద్దని సూచించారు. చివరి గింజ వరకు వడ్లు కొంటామని వెల్లడించారు. గత సర్కార్ రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ తో మొదలు పెడతామని చెప్పారు. రైతుల పేరు మీద రాజకీయాలు చేయొద్దని సూచించారు. ధాన్యం కొనుగోలుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని భట్టి విక్రమార్క చెప్పారు.