ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్ 

ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్ 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది. శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలిగించేలా వ్యవహరించారంటూ సుల్తాన్ బజార్ పోలీసులు ఆయనపై కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 188, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. శోభాయాత్రకు సంబంధించి ఏసీపీ ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగజేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

ఏప్రిల్ 10న శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా పుత్లీబౌలీ క్రాస్ రోడ్ వద్ద రాజాసింగ్ తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున డీజే సౌండ్తో ప్రజలకు అసౌకర్యం కలిగించారు. రాజాసింగ్ కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పాటు అదే రోజు రాత్రి 11గంటల సమయంలో రాజాసింగ్ హనుమాన్ వ్యాయామశాల గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకుగానూ పోలీసులు రాజాసింగ్పై కేసు బుక్ చేశారు.

For more news..

బీహార్ సీఎం సభలో పేలుడు కలకలం

అప్పులు కట్టలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం