అస్సాం సీఎం హిమంతపై కేసు నమోదు

అస్సాం సీఎం హిమంతపై కేసు నమోదు

అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు రగడ మరింత పెరిగింది. ఇటీవల సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు అస్సాం పోలీసులు చనిపోయారు. సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలకు తాము డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడమే కారణమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అంటున్నారు. అయితే.. సరిహద్దు హింసకు సంబంధించిన మిజోరంలో ఇవాళ(శనివారం) కేసులు నమోదయ్యాయి.

ఏకంగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై మిజోరంలో క్రిమినల్ కేసు నమోదైంది. అలాగే..అస్సాంకు చెందిన నలుగురు పోలీసు అధికారులు, ఇద్దరు పరిపాలన అధికారులపై కూడా మిజోరం పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, భద్రతా రీత్యా మిజోరం సరిహద్దుల దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని తమ పౌరులకు అస్సాం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అస్సాం ప్రజలను రెచ్చగొట్టే విధంగా మిజోరం విద్యార్థి సంఘాలు వ్యవహరిస్తున్నాయని చెప్పింది. మిజోరం కు రాకపోకలు కొనసాగించకూడదని తెలిపింది.