గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం: 15 మంది మృతి

గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం: 15 మంది మృతి

గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సూరత్ లోని సర్థనా ఏరియాలోని ఓ బిల్డింగ్ లో మంటలంటుకున్నాయి. ఈ బిల్డింగ్ లో ఓ కోచింగ్ సెంటర్ నడుస్తున్నట్టు సూరత్ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే స్పాట్ కు చేరుకున్న 18 ఫైరింజన్లు మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఒక్కసారిగా మంటలంటుకోవడంతో కోచింగ్ సెంటర్ లో ఉన్నవారంతా తలోదిక్కు పరుగులు పెట్టారు. దట్టమైన పొగవల్ల ఊపిరాడకపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు మరికొందరు బిల్డింగ్ కిటికీల్లోంచి కిందుకు దూకారు. ఇలా దూకిన వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ స్పందించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

అటు.. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.