రాజధాని ఎక్స్‌‌ప్రెస్‌‌ లో అగ్ని ప్రమాదం

రాజధాని ఎక్స్‌‌ప్రెస్‌‌ లో అగ్ని ప్రమాదం
  • మధ్యప్రదేశ్​లోని రత్లాం జిల్లాలో ఘటన

భోపాల్(రత్లాం): మధ్యప్రదేశ్‌‌లోని రత్లాం జిల్లాలో తిరువనంతపురం– హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌‌ప్రెస్ (12431)లో ఆదివారం తెల్లవారుజామున  అగ్ని ప్రమాదం జరిగింది. బీ-1  ఏసీ కోచ్‌‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.  గార్డు లోకో పైలట్‌‌ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు. 68 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణ, దేశవ్యాప్త రైలు కోచ్‌‌ ల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్​కు ఆదేశించింది.