గోదావరిఖనిలో అగ్నిప్రమాదం జరిగింది.. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంగళవారం ( ఏప్రిల్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..గోదావరిఖనిలోని గంగా నగర్ పెట్రోల్ బంక్ దగ్గర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్నిరోజులుగా పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో విద్యుత్ తీగలకు కూడా మంటలు వ్యాపించాయి.
లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉండటంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు స్థానికులు.
ALSO READ ; ప్రభుత్వం చర్చలకు పిలవలేదు
ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆగి ఉన్న లారీకి సంబంధించిన వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు పోలీసులు.

