
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లిరికల్ ‘చోటీ చోటీ బాతే.. మీఠీ మీఠీ యాదే’ అనే సాంగ్ ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వహించి స్వయంగా పాడి ఈ పాటకు అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీవీపీ, అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.