నువ్వేం చేయగలవని ఎగతాళి చేశారు.. దేశంలోనే మొదటి లేడీ లారీ మెకానిక్ గా నిలిచింది

నువ్వేం చేయగలవని ఎగతాళి చేశారు.. దేశంలోనే మొదటి లేడీ లారీ మెకానిక్ గా నిలిచింది
ఢిల్లీలోని  “సంజయ్ గాంధీ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ నగర్” ఆసియాలోనే అతిపెద్ద లారీ హాల్ట్‌‌‌‌ పాయింట్. 75 ఎకరాలలో ఉండే ఈ ప్రాంతంలో 70 వేల ట్రక్కులు ఎప్పుడూ ఏదో ఒక రిపేర్ కోసం ఆగి ఉంటాయి.  ఈ ప్లేస్ నుంచి రోజుకు 20 వేల లారీలు రిపేర్ అయి బయల్దేరతాయి.  మెకానిక్స్, హెల్పర్స్, స్టోర్ కీపర్స్ ఇలా కొన్ని వందలమంది రకరకాల పనులతో బతుకుతుంటారు. అక్కడే ఓ పెద్దావిడ శాంతిదేవి. వయసు దాదాపు 59 ఏళ్లు. రిపేర్ కోసం, సర్వీస్‌‌‌‌ కోసం అక్కడ ఆగి ఉన్న లారీల మధ్య తిరుగుతూ ఉంటుంది. కొత్తవాళ్లు ‘ఆ పెద్దావిడకి అక్కడ ఏం పని? అసలు మెకానిక్ పాయింట్‌‌‌‌లో ఆమె ఏం చేస్తోంది?’ అనుకుంటారు. నిజమే ఆ వయసులో ఉన్న ఆమె అక్కడ ఏం చేయగలదు?  మహా అయితే ‘ఓ చాయ్ దుకాణం నడుపుకుంటూ బతుకు వెళ్లదీస్తుంది లే’  అనుకుంటారు ఎవరైనా. కానీ శాంతీ దేవి అక్కడ సీనియర్ మెకానిక్. నిజమే ఆమె లారీ మెకానిక్. మన దేశంలోనే మొదటి లేడీ లారీ మెకానిక్. ఇరవైయ్యేళ్లకి పైనే ఇరవై నాలుగు సంవత్సరాలనుంచి ఆమె అక్కడే పని చేస్తోంది. లారీ మెకానిక్ అంటే మగవాళ్లకే మామూలు విషయం కాదు 50 కిలోలకు పైగా బరువుండే స్పేర్ పార్ట్స్ ఎత్తాలి. జాకీతో లారీ బాడీ లిఫ్ట్ చేయాలి. ఇక టైరు మార్చాలన్నా, పంక్చర్ వేయాలి అన్నా మామూలుగానే ఒకరు చేసే పని కాదు. శాంతి దేవి అక్కడ పని చేయటానికి వచ్చిన మొదట్లో ‘‘ఈ పనులన్నీ నువ్వు  చెయ్యలేవు” అన్నారట తోటి మెకానిక్స్​ . కానీ ఏమాత్రం జంకులేకుండా అక్కడే దాదాపు 25 సంవత్సరాలుగా పని చేస్తోంది. ఎనిమిది మంది పిల్లలు మధ్యప్రదేశ్‌‌‌‌ గ్వాలియర్‌‌‌‌ పట్టణానికి చెందిన శాంతీదేవి 35 ఏళ్ల వయసప్పుడు ఢిల్లీ చేరుకుంది. భర్త రామ్‌‌‌‌బహుదూర్‌‌‌‌ లారీ మెకానిక్‌‌‌‌గా ఎస్‌‌‌‌జిటిఎన్‌‌‌‌లో పనిచేసేవాడు. ఇది ఆమెకు రెండో పెళ్లి. 21 ఏళ్ల వయసులోనే మొదటి భర్త చనిపోయాడు. శాంతీదేవిని పెళ్లి చేసుకోవడానికి ముందే బహదూర్‌‌‌‌కు నలుగురు బిడ్డలు. ఆ తరువాత శాంతీదేవికి మరో నలుగురు బిడ్డలు పుట్టారు. మొత్తం ఎనిమిది మంది పిల్లల్ని పెంచాలి అంటే బహదూర్ సంపాదన సరిపోయేది కాదు. అందుకే భర్త పని చేసే దగ్గరే ఒక టీ దుకాణం తెరిచింది శాంతి. తర్వాత అక్కడ పని చేస్తున్న మెకానిక్కులను చూస్తూ తాను కూడా ఆ పని ఎందుకు చేయకూడదు అని మెకానిక్‌‌‌‌గా మారిపోవాలని అనుకుంది. మొదట్లో బహదూర్, అక్కడ పని చేసే మిగతా వర్కర్లంరూ “నువ్వు ఈ పనులు చేయలేవు” అన్నారట. కొంత మంది మొదట్లో అనుమానంగా చూశారు. ఇంకొందరు ఎగతాళి చేశారట. కానీ అలాంటి మాటలేవీ పట్టించుకోలేదు శాంతిదేవి. రోజుకి 12 గంటలు పని మొదట్లో భర్తతో కలసి శాంతిదేవి కూడా కలిసే ఆ వర్క్ షాప్ లో పని చేసేవాళ్లు. అయితే రెండేళ్ల కిందట రామ్‌‌‌‌బహుదూర్‌‌‌‌ చనిపోయాడు. దీంతో  ఇప్పుడు ఆమె ఒక్కతే ఆ వర్క్ షాప్ నడుపుతోంది.  సంజయ్ గాంధీ నగర్ అంటేనే ఆటో మొబైల్ వర్కర్ల లో చెయ్యి తిరిగిన మెకానిక్కులు ఎందరో  ఉండే ప్లేస్ అది. అలాంటి చోట ఉండే మిగతా మెకానిక్ లకి ఏమాత్రం తగ్గకుండా రోజుకి పది వరకూ లారీ టైర్లకు  పంక్చర్లు వేస్తోంది శాంతి. ఒక్కొక్క టైరు బరువు 50 కిలోల వరకూ ఉంటుంది. దానికి బోల్ట్‌‌‌‌లు తీయటం, బిగించటం కూడా అంత ఈజీకాదు. లారీకి ఉన్న టైరు బయటికి తీయాలంటే ముందు జాకీతో లారీ బాడీని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంక్చర్ వేయటానికి రిమ్ నుంచి టైర్‌‌‌‌‌‌‌‌ని వేరు చేయటం మళ్లీ ఆ టైర్‌‌‌‌‌‌‌‌ని ట్రక్‌‌‌‌కి బిగించటం…. ఇదంతా మాటల్లో చెప్పినంత లైట్ వర్క్ కాదు. కానీ శాంతి దేవి ఈ వయసులో కూడా ఆ పనులన్నీ ఒంటి చేత్తో ఈజీగా చేస్తోంది. రోజుకి 12 గంటల పాటు ఒక పక్క టీ దుకాణం నడుపుతూనే వర్క్ షాప్‌‌‌‌ని కూడా చూసుకుంటోంది. for more News.. న్యూ హెల్తీ ట్రెండ్: చిరుధాన్యాలతో ఇడ్లీలు.. విస్తరాకుల్లో వడ్డన వన్​ నేషన్​.. వన్ క్యాస్ట్ విధానం రావాలె చెట్టు కొమ్మలు నరికినందుకు.. రూ.8 వేలు ఫైన్​