బీజేపీ అంటే బ్రిటీష్​ జనతా పార్టీ: సీఎం రేవంత్

బీజేపీ అంటే బ్రిటీష్​ జనతా పార్టీ: సీఎం రేవంత్

డెబ్బయ్యేండ్లుగాఅమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్రచేస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘బీజేపీ వాళ్లు నమో అంటున్నారు.. నమో అంటే నమ్మించి మోసం చేయడం. ఇయాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి.. సిద్దిపేటలో అమిత్​షా, మొన్న మధ్యప్రదేశ్​లో మోదీ మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నరు. 400 సీట్లు వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నరు” అని మండిపడ్డారు.

బీజేపీ అంటే  బ్రిటీష్ జనతా పార్టీ అని, వాళ్ల ఎజెండా బ్రిటీషోళ్ల ఎజెండా లెక్క ఉంటుందని విమర్శించారు. బీజేపీ నేతలు దేవుడిని అడ్డు పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ‘‘దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి..” అని చెప్పారు. ‘‘రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా చెప్తున్నారు.. దీనికి చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఏం సమాధానం చెప్తారు?” అని ఆయన ప్రశ్నించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి శ్రీగణేష్​ను, మల్కాజ్​గిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్​రెడ్డిని, చేవెళ్ల కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డిని గెలిపించాలని రేవంత్​రెడ్డి కోరారు.