సందడిగా ‘ఉస్మానియా తక్ష్ 2024’

సందడిగా ‘ఉస్మానియా తక్ష్ 2024’

ఓయూ, వెలుగు : ఉస్మానియా తక్ష్ -2024  పేరుతో నిర్వహిస్తున్న ఓయూ ఆవిర్భావ వేడుకలు గురువారం కొనసాగాయి. ఆయా విభాగాల్లో నిర్వహించిన ఓపెన్ డే కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్రంలోని వివిధ కాలేజీలు, స్కూళ్లకు చెందిన స్టూడెంట్లు భారీగా తరలివచ్చారు. ల్యాబ్ టు ల్యాండ్ పేరుతో ల్యాబుల్లో జరుగుతున్న పరిశోధనలను వివరించేందుకు ఓపెన్ డే నిర్వహించారు.

ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్​పి.లక్ష్మీనారాయణ ఆయా కాలేజీలు తిరిగి, ప్రదర్శనలను తిలకించారు. తెలుగు విభాగం ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం అలరించింది. ఆంగ్ల విభాగం ముద్రించిన బ్రోచర్ ను ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ​అర్జున్ రావు ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక లైబ్రరీలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను వీసీ ప్రారంభించారు.

టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ కాపర్తి రామలింగం మూడో స్మారక మోడలింగ్ సిమ్యులేషన్ పోటీలను నిర్వహించారు. ఇంజనీరింగ్, లా, కామర్స్ కాలేజీల్లోని ఆయా విభాగాల్లో ఓపెన్ డే నిర్వహించారు.