హైదరాబాద్ లో ఐదుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్...బాధితులకు రూ.50.31 లక్షల రీఫండ్

హైదరాబాద్ లో ఐదుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్...బాధితులకు రూ.50.31 లక్షల రీఫండ్

మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో ఐదు ప్రధాన సైబర్ మోసాల కేసులను ఛేదించి, ఐదుగురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. 

మే 24 నుంచి 30 వరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో పెట్టుబడుల పేరుతో మోసాలు, నకిలీ ఉద్యోగాలు, కస్టమర్ కేర్, డిజిటల్ అరెస్ట్ వంటి పలు కేసులను గుర్తించి, కోర్టు అనుమతితో బాధితులకు రూ.50.31 లక్షల సొమ్మును తిరిగి అందజేశారు.