గుజ‌రాత్ లో విషాదం: ఐదుగురు కుటుంబ స‌భ్యుల ఆత్మ‌హ‌త్య

గుజ‌రాత్ లో విషాదం:  ఐదుగురు కుటుంబ స‌భ్యుల ఆత్మ‌హ‌త్య

గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్​​లో తీవ్ర విషాదం నెలకొంది. గోధ్రా రోడ్ ఏరియాలో ఒకే ఫ్యామిలీకి చెందిన‌ ఐదుగురు సభ్యులు పాయిజ‌న్ తీసుకోని  ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధితుల్లో భార్యభ‌ర్త‌లు సహా.. ముగ్గురు పిల్లలూ ఉన్నారు. సుజయ్​ భాగ్​ ఏరియాకి చెందిన సైఫుద్దిన్ ​..​ తన భార్య, ముగ్గురు పిల్లలతో ఓ బిల్డింగ్‌లో నివాసముంటున్నాడు. రోజూ పిల్ల‌ల అల్లరితో సంద‌డిగా ఉండే ఇంటి నుంచి ఒక రోజంతా ఎలాంటి మాటలు విన్పించకపోవడంతో స్థానికుల‌కు అనుమానం వ‌చ్చింది. తలుపులు బ‌ద్ద‌లుకొట్టి చూడ‌గా, కుటుంబసభ్యులంతా లోప‌ల‌ చనిపోయి కన్పించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డెడ్‌బాడీల‌ను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.