సీఎం కేసీఆర్ కు కమీషన్ల మీద దృష్టి తప్పా ప్రజల పై లేదన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి. కేసీఆర్ కు కమీషన్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే పేరు పెట్టాలని తెలిపారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో హైదరాబాద్ లోని మ్యారేట్ హోటల్ జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ కు అహంకారం పెరిగిందని…ప్రజలు అంటే చిన్న చూపు అన్నారు. కరోనా టైం లో …హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడని తెలిపారు. ప్రజల సమస్యలు పట్టని ఇలాంటి సీఎం మనకు అవసరమా అని అన్నారు. ఫామ్ హౌజ్ లో డబ్బుల మిషన్ లు పెట్టుకున్నాడని…డబ్బులు లెక్కపెట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నాడన్నారు. MLC ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇవ్వాలన్నారు.
మనం గ్రాడ్యుయేట్ ఓటర్లమన్న వివేక్ వెంకటస్వామి…ఎట్టి పరిస్థితుల్లోనూ TRS కు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. బీజేపీ MLC అభ్యర్ధి రాంచందర్ రావు ను గెలిపించాలనీ గ్రాడ్యుయేట్ ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు.