గండిపేట, వెలుగు : అత్తాపూర్లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతూ సమోసాలు, పానీ పూరీలు తయారు చేస్తున్న కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఇక్కడ పానీపూరీలు, సమోసాలు భారీగా తయారు చేసి నగరంలోని వివిధ బండ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండానే వ్యాపారం సాగుతోందని, కిచెన్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. విపరీతమైన ఈగలు కనిపించాయి. ఓపెన్ డ్రైనేజీ పక్కనే వంటలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా 3 వేల పానీపూరీలు, 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడిన నూనెను స్వాధీనం చేసుకుని పారబోశారు. నాణ్యత పరిశీలనకు నమూనాలు సేకరించి కేంద్రాన్ని సీజ్ చేశారు.
