ఫుట్‌పాత్‌లను వ్యాపారులు కబ్జా చేయడంతో పాదచారులు రోడ్డుపై వెళ్లాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. మెహిదీపట్నం సెంటెన్స్ కాలేజీ ఎదుట జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫుట్ పాత్లపై పలువురు వ్యాపారులు షాపులు నిర్వహిస్తున్నారు. దీంతో కాలేజీ విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
