ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జాన్ ఎడ్రిచ్ (83) నిన్న(శుక్రవారం) చనిపోయాడు. ఆయన మృతి వార్తను ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 2000 నుంచి ఎడ్రిచ్ లుకేమియాతో బాధపడుతున్నాడు. ఎడమ చేతి వాట బ్యాట్స్‌మెన్ అయిన ఎడ్రిచ్.. కౌంటీ తరఫున ఆడి 103 ఫస్ట్ క్లాస్ సెంచరీలు చేశాడు. 77 టెస్టులు ఆడిన ఎడ్రిచ్.. 43.54 సగటుతో 5,138 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ఓ మంచి క్రికెటర్‌ను కోల్పోయిందన్నారు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టోమ్ హరిసన్. ట్విట్టర్ వేదికగా నివాళుర్పించారు. 5000 పైన పరుగులు చేసిన అతికొద్ది మంది క్రికెటర్స్‌లో ఎడ్రిచ్ ఒకరన్నారు. 1965లో న్యూజిలాండ్‌పై టెస్టులో 310 పరుగుల చేసిన నాటౌట్‌గా నిలిచాడని, ఇదే ఐదో భారీ స్కోరుగా నిలిచిందని చెప్పుకొచ్చాడు.
