కేంద్ర బడ్జెట్ తెలంగాణ కు సువర్ణావకాశం : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

కేంద్ర బడ్జెట్ తెలంగాణ కు సువర్ణావకాశం : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
  •     మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్ 2026–-27 తెలంగాణ రాష్ట్రానికి సువర్ణావకాశమని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకత్వం విఫలమవుతున్నదని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రకటించిన 3 హైస్పీడ్ రైలు కారిడార్ల ద్వారా తెలంగాణ.. నేషనల్‌‌ లాజిస్టిక్స్, మొబిలిటీ హబ్‌‌గా మారుతుందని  అభిప్రాయపడ్డారు.

కేంద్ర బడ్జెట్‌‌లో రికార్డు స్థాయిలో రూ.12.12 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్ ప్రకటించారని, దీని ద్వారా తెలంగాణలోని రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్-2, ఎంఎంటీఎస్ విస్తరణలాంటి కీలక ప్రాజెక్టులకు నిధులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. వీబీ జీ రామ్ జీ కింద కేటాయించిన రూ.95 వేల కోట్ల నుంచి తెలంగాణకు కనీసం రూ.5 వేల కోట్లు పొందే అవకాశం ఉన్నదని తెలిపారు. గతంతో పోలిస్తే తెలంగాణకు 13.5 శాతం అధికంగా కేంద్రం నిధులు కేటాయించినట్లు చెప్పారు.