బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌‌‌‌లో చేర్చాలి : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌‌‌‌లో చేర్చాలి : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

హైదరాబాద్, వెలుగు: బంజారా ప్రజల చిరకాల స్వప్నమైన ‘గోర్బోలి’ (బంజారా) భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌‌‌‌లో వెంటనే చేర్చాలని బంజారా భారత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌‌‌‌లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే తెలంగాణ శాసనసభ గోర్బోలి భాష గుర్తింపుపై ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌‌‌‌లో చర్చకు పెట్టి ఆమోదించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ‘జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్’ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బంజారాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సంబంధిత కేంద్ర మంత్రులను కలవనున్నట్టు రవీంద్ర నాయక్  వెల్లడించారు.